నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డులు

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

మహబూబాబాద్‌: అర్హులైన ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ప్రభుత్వ నిబంధనల మేరకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్‌, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్నేహశబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవా రం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ.. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేస్తారన్నారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 447 ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చాయని, నిబంధనల మేర కు కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజల కు అందించాలన్నారు. కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతీదశలో పారదర్శకత పాటించాలన్నారు. డీపీఆర్వో రాజేంద్రప్రసాద్‌, కమిటీ సభ్యులు సీహెచ్‌.శ్రీనివాస్‌, ఈరగాని బిక్షం, వేముల అయోధ్య రామయ్య, నవాబ్‌, షేక్‌ అక్రం, ఎం.మోహన్‌రెడ్డి, గాడిపెల్లి శ్రీహరి, ఉమ్మగాని మధు, ఉప్పల రంగా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement