తొర్రూరు: ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తొర్రూరు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జిలుకర యాదగిరి తెలిపారు. ఈ మేరకు మూడో రోజు సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్ మృతికి సంతాపంగా జేఏసీ ఆధ్వర్యంలో డిపోనుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. శంకర్‌గౌడ్ మృతి ఆర్టీసీ కార్మిక ఉద్యమానికి తీరనిలోటు అని, ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు పోరాటాలు ము మ్మరం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు ప్రారంభించాలన్నా రు. కలిసికట్టుగా న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ జి.రమేశ్, కోశాధికారి రవీందర్, సలహాదారులు మల్లికార్జున్, ఆర్‌ఎస్ కుమార్, జి.యాకయ్య, బీకే స్వామి, జి.వెంకన్న, ఎంకే రావు, ఎవీఎం చారి, ఎండీ షాబుద్దీన్, ఎంఎస్ బాబులు పాల్గొన్నారు.


