హన్మకొండ కల్చరల్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటనలో భాగంగా ఈ మౌఖిక పరీక్షలు హైదరాబాద్ బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద గిరిజన విజ్ఞానంపై జరిగే ఈ ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థుల పరిశోధన సామర్థ్యం, సంబంధిత పరిశోధన అంశంపై అవగాహన, అకాడమిక్ ప్రతిభను సమగ్రంగా అంచనా వేస్తామని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు తీసుకురావాలని డాక్టర్ గడ్డం వెంకన్న సూచించారు.
మూడో రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె
● ఆర్టీసీ కార్మికుల ధర్నాలు
హన్మకొండ: తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు మూడో రోజు శుక్రవారం సమ్మె కొనసాగించారు. సమ్మెలో భాగంగా శుక్రవారం హనుమకొండలోని వరంగల్–1, హనుమకొండ డిపోల వద్ద కార్మికులు ధర్నా చేశారు. సమ్మె నేపథ్యంలో పోలీసులు మొహరించారు. హనుమకొండ డిపో వద్ద ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు డిపో సమీపంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే తాము డిపో ఎదుట ధర్నా చేస్తామ ని హనుమకొండ డిపో కార్మికులు పట్టుపట్టారు. శాంతియుతంగా ధర్నా, నిరసన తెలుపుతామని పో లీసులను కోరారు. అనుమతించడంతో డిపో ముందుకు చేరుకుని ధర్నా చేశారు. అరగంటకు పైగా ధర్నా చేసిన అనంతరం రాంనగర్ కూడలిలో నిరసనను కొనసాగించారు. వరంగల్– 1 డిపో వద్దకు కార్మికులను రానివ్వకపోవడంతో సమీపంలో ధర్నా ను కొనసాగించారు. శంకర్ గౌడ్ మృతి చెందడంతో రెండు రోజుల పాటు సమ్మెకు దూరంగా ఉన్న సూపర్ వైజర్లు, అన్ని విభాగాల క్లరికల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.
న్యాయవాదుల సహకార సంఘం ఎన్నికలు
వరంగల్ లీగల్: హనుమకొండలోని న్యాయవాదుల సహకార సంఘం భవనంలో ఆసంఘ ఎన్నికలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరిగాయి. సంఘంలో మొత్తం 1,326 మంది ఓటర్లు ఉండగా.. 686 మంది న్యాయవాదులు ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ప్రధాన ఎన్నికల అధికారి చిదంబరనాథ్ ఫలి తాలు వెల్లడించారు. ఆ ఫలితాల్లో బండారి కవిత (350 ఓట్లు), ఎ.కిరణ్‌సింగ్ (272 ఓట్లు) పి.శ్రీనివాస్ (259ఓట్లు), టి.శ్రీనివాస్ (237 ఓట్లు) సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.


