కస్తూరి కాటన్‌ భారత్‌ ఈపోర్టల్‌ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కస్తూరి కాటన్‌ భారత్‌ ఈపోర్టల్‌ అభివృద్ధి

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

ఖిలా వరంగల్‌: కస్తూరి కాటన్‌ భారత్‌ బేల్స్‌కొనుగోలు, విక్రయాల కోసం సీసీఐ ప్రత్యేక ఈ పోర్టల్‌ అభివృద్ధి చేయడం అభినందనీయమని తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ(ఎంసీపీ)లోని కాంపొనెంట్‌–2 కింద ఈపోర్టల్‌ అభివృద్ధిపై నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో బొమ్మినేని రవీందర్‌ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈపోర్టల్‌ ద్వారా కాటన్‌ ట్రేడింగ్‌లో ధరల పారదర్శకత పెరగడమే కాకుండా, వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. కస్తూరి కాటన్‌ బేల్స్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లలో వినియోగం పెంచడానికి నాణ్యతా ప్రమాణాలను నిర్దారించే టెక్స్‌ ప్రోసిల్‌ ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో పొందుపరచాలన్నారు. దేశీయ వినియోగదారులైన స్పిన్నింగ్‌ మిల్లులు జిన్నర్స్‌కు ప్రోత్సాహకాలను అందిస్తే బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో జిన్నర్స్‌, ట్రేడర్స్‌ను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు.

తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement