మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

హనుమకొండ జిల్లా వంగపహాడ్‌లో ఘటన

ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ వరికోలు రవీందర్‌ ఆత్మహత్యకు యత్నించారు. గురువారం రాత్రి జరిగిన ఈఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీందరప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే రవీందర్‌ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై స్థానిక ఇన్‌స్పెక్టర్‌ చేరాలును సంప్రదించగా.. రవీందర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తమకు సమాచారం ఉందని, అయితే లిఖితపూర్వకంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

వడదెబ్బతో కూలీ మృతి

నల్లబెల్లి: వడదెబ్బతో కూలీ మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొడిగె రవి(56) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement