కాశిబుగ్గ: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన నల్లపు నారాయణ (80) శుక్రవారం మృతిచెందాడు. అయితే నారాయణ గతంలోనే దేహదాన అంగీకార పత్రం ఇవ్వడంతో మృతుడి కుమార్తె స్వరూప సహకారంతో వైద్య విద్య పరిశోధన కోసం నారాయణ మృతదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు శుక్రవారం అప్పగించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ శశికాంతాచారికి అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్, కోటేశ్వర్‌రావు, గంగుల దయాకర్, రాచర్ల బాలరాజు, గండ్రాతి హరిబాబు, మర్రి మహేష్, ఈరెల్లి మల్లేష్ పాల్గొన్నారు.


