చదువుతోనే అంతరాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే అంతరాల తొలగింపు

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

విద్యారణ్యపురి: విద్యార్థులకు సమాన అవకాశాలు గల విద్యను అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని అసంత్‌భవన్‌లో నిర్వహించిన ‘మారుతున్న తెలంగాణ విద్యావిధానం’ అనే అంశంపై విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో విద్యారంగంలో మార్పులు వస్తాయని భావించిన ప్రజలను పాలకుల విధానాలు నిరాశ పరుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు విద్యారంగానికి తగినంత బడ్జెట్‌ కేటాయించడంలేదన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. సీఎం మాటలకు.. చేతలకు పొంతనలేదన్నారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. విద్యాకమిషన్‌ సిఫారసులపై విద్యారంగ మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలుచేయాలన్నారు. ఈ సదస్సులో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బాధ్యులు గోవిందరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, చాప బాబు, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, రామకృష్ణ, మెండు రవీందర్‌, అంజనీదేవి, సుమ, సుభాషిణి, మల్లయ్య మాట్లాడారు.

సంజీవరెడ్డి అభినందన సభ

డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌, హనుమకొండ జిల్లా పూర్వ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ నేపథ్యంలో శుక్రవారం అభినందన సభను నిర్వహించారు. సంజీవరెడ్డి డీటీఎఫ్‌ బాధ్యుడిగా, ఉపాధ్యాయుడిగా అందించిన సేవలను డీటీఎఫ్‌ బాధ్యులు కొనియాడారు. ఈసభకు డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు.

సెంట్రల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement