రఘునాథపల్లి: ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళ్తున్న సబిత, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోతు కవిత తదితరులును శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి సీఐ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ.. సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సు సర్వీసులు నడిపి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను రెచ్చగొట్టడం వల్లనే శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సబిత ఆరోపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బీఆర్‌ఎస్ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. బండి సంజయ్‌కు ఎస్కార్ట్ ఇచ్చి నర్సంపేటకు పంపిన ప్రభుత్వం.. తమను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందన్నారు. మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, కవిత మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులపై అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లనే శంకర్‌గౌడ్ ఆత్యహత్య చేసుకున్నాడని అన్నారు. ఎమ్మెల్యే పల్లా.. బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. నాయకులు సిద్దిలింగం, రాజిరెడ్డి, మధు, విజయ్, గూడ కిరణ్, దుబ్బాక హరీశ్, ఎడ్ల బా లరాజు, పయ్యావుల రవి, యాకయ్య, యాకస్వామి పాల్గొన్నారు.
రెచ్చగొట్టడం వల్లనే శంకర్‌గౌడ్
ఆత్మహత్య
మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి


