ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం

Apr 25 2026 7:48 AM | Updated on Apr 25 2026 7:48 AM

హన్మకొండ: ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని, డ్రైవర్‌ కోలా శంకర్‌ గౌడ్‌ది ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. శంకర్‌ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లో పోలీసులు గృహ నిర్బంధం విధించా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చింతల యాదగిరి, మార్గం భిక్షపతి, రాజు, యాకాంతం, జక్కు రమేష్‌గౌడ్‌ను పోలీసులు రాత్రి వరకు హౌజ్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా హౌస్‌ అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతోపాటు అండగా ఉంటుందన్నారు. శంకర్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యకు రేవంత్‌ సర్కార్‌దే బాధ్యత అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకెతకాలం గడుపుతావని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలు తరిమి కొట్టేదాకా చూసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

హనుమకొండలో హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement