హన్మకొండ: సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకుల టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే టర్మినేషన్ చేస్తామని మెమో జారీ చేసింది. ఈ మెమోను ఆర్టిజన్ ఉద్యోగులకు వక్తిగతంగా పంపింది. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె లోకి వెళ్లింది. ఏడు రోజులుగా ఆర్టిజన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో బుదవారం విధుల్లోకి హాజరు కావాలని మెమో జారీ చేయడంతో ఆర్టిజన్‌లో సందిగ్ధంలో పడ్డారు. అయినా సమ్మెలోనే కొనసాగాలని ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15 (నేటి)నుంచి క్యాంపస్‌లోని క్రీడా మైదానంలో వివిధ యూనివర్సిటీ కాలేజీలు, వివిధ విభాగాలతోపాటు హనుమకొండలోని సుబేదారిలో ఉన్న యూనివర్సిటీ కాలేజీల విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించబోతున్నారు. కాకతీయ యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పేరిట ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ మామిడాల ఇస్తారి మంగళవారం తెలిపారు. క్రికెట్, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబోతున్నామన్నా రు. పది రోజులపాటు ఈ క్రీడాపోటీలు కొనసాగుతాయన్నారు. కేయూ స్పోర్ట్స్‌బోర్డు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ సహకారంతో ఈ క్రీడలు నిర్వహించబోతున్నామన్నారు.
నేడు స్టూడెంట్స్ వెల్ఫేర్
డీన్ ఆఫీస్ ప్రారంభోత్సవం
కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ల డైరెక్టర్‌కార్యాలయం సమీపంలోనే స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ఉదయం 10 గంటలకు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం ప్రారంభించనున్నారని డీన్ ఇస్తారి తెలిపారు.
బాలికపై అత్యాచారం..
● నలుగురిపై పోక్సో,
అట్రాసిటి కేసు నమోదు
భీమదేవరపల్లి: మండలంలోని ఓ గ్రామంలో దివ్యాంగ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో నలుగురిపై నిందితులపై పోలీసులు పోక్సో, అట్రాసిటి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల కిత్రం ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలికను మల్లారం గ్రామానికి చెందిన నిందితుడు శివ బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడికి అదే గ్రామానికి చెందిన స్నేహితులు మణికంఠ, వేణు, టోనీ సహకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురిపై పోక్సో, అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.
వ్యాపారిపై
యాచకుడి దాడి
మహబూబాబాద్ రూరల్ : ఓ యాచకుడు తనకు దానం చేసిన వ్యాపారిపై కత్తితో దాడి చేసి స్వల్పంగా గాయపరిచాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యాచకుడు ఓ మహిళతో కలిసి జిల్లా కేంద్రంలో భిక్షాటన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక నెహ్రూ సెంటర్ ప్రాంతంలో స్వాతి మార్కెటర్స్ షాపు వద్దకు రాగానే షాపు యజమాని వడ్డేపల్లి శ్రీనివాస్.. యాచకుడికి రూ.5 దానంగా ఇచ్చాడు. అప్పటికే పెద్దమ్మలోడు (పోతురాజు) వేషధారణలో ఉన్న ఆ యాచకుడు దానం సరిపోదని షాపులోకి వెళ్లి కత్తితో దాడి చేయగా శ్రీనివాస్ కుడిచేయి మణికట్టు వద్ద స్వల్ప గాయమైంది. వెంటనే ఘర్షణ చోటు చేసుకోగా స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రామచందర్ ఘ టనాస్థలికి చేరుకుని సదరు యాచకుడితో పాటు అతడితో ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అప్పగించారు. దానం ఇచ్చిన వ్యక్తిపై యాచకుడు కత్తితో దాడి చేయగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


