డీఎస్పీ శిక్షణలోనే సివిల్స్‌ ర్యాంకు.. | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీ శిక్షణలోనే సివిల్స్‌ ర్యాంకు..

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌ గ్రూప్‌–1 పరీక్షల్లో 105వ ర్యాంక్‌ సాధించి డీఎస్పీగా హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. శుక్రవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 793వ ర్యాంక్‌ సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్‌ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎల్లమ్మ(నానమ్మ) కష్టపడి పెంచారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చదువులో ముందుకు సాగిన ప్రవీణ్‌ ఈ విజయాన్ని అందుకోవడంపై స్థానిక ప్రజలు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement