ఐదుగురు ఏఆర్‌లకు అంతర్గత బదిలీలు | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు ఏఆర్‌లకు అంతర్గత బదిలీలు

Jun 3 2025 5:39 AM | Updated on Jun 3 2025 5:39 AM

ఐదుగురు ఏఆర్‌లకు అంతర్గత బదిలీలు

ఐదుగురు ఏఆర్‌లకు అంతర్గత బదిలీలు

కేయూ క్యాంపస్‌: కేయూలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల (ఏఆర్‌)ను అంతర్గంగా బదిలీలు చేశారు. అలాగే, వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మరో ఏఆర్‌కు మరో రెండుచోట్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

● యూనివర్సిటీ కాలేజీలో ఏఆర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. శ్రీధర్‌ను పరిపాలనాభవనంలోని టీచింగ్‌,నాన్‌టీచింగ్‌ విభాగాలకు బదిలీ చేశారు. అదనంగా లీగల్‌ సెల్‌ బాధ్యతలు అప్పగించారు.

● టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ విభాగంలో ఏఆర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీహెచ్‌ ప్రణయ్‌కుమార్‌ను సీడీసీ విభాగానికి బదిలీ చేశారు. యూనివర్సిటీ ఫార్మసీకాలేజీ, కేయూ గెస్ట్‌హౌజ్‌ అదనపు బాధ్యత అప్పగించారు.

● కేయూ పరీక్షల విభాగంలో ఏఆర్‌గా పనిచేస్తున్న ఆర్‌. శ్రీలతాదేవిని పరిపాలన భవనంలోని అకౌంట్స్‌ విభాగానికి బదిలీచేశారు.సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల డైరెక్టర్‌ కార్యాలయం అదనపు బాధ్యతలు అప్పగించారు.

● కేయూ అకౌంట్స్‌ విభాగంలో ఏఆర్‌గా పనిచేస్తున్న కె.శ్రీలతను హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కాలేజీకి బదిలీ చేశారు. సుబేదారి యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు.

● కేయూ ఇంజనీరింగ్‌కాలేజీ(కోఎడ్యుకేషన్‌) ఏఆర్‌గా పనిచేస్తున్న బి. నేతాజీని పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. అలాగే, అదే ఇంజనీరింగ్‌కాలేజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు.

● కేయూ అకడమిక్‌ బ్రాంచ్‌లో ఏఆర్‌గా పనిచేస్తున్న కోలశంకర్‌ను క్యాంపస్‌లోని యూనివర్సిటీ కాలేజీ, అలాగే ఎడ్యుకేషన్‌ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు.

అదనపు బాధ్యతలు కూడా..

మరో ఏఆర్‌కు సైతం అదనపు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement