రైల్వే బ్లాక్‌తో రవాణాకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

రైల్వే బ్లాక్‌తో రవాణాకు అంతరాయం

Jun 4 2025 1:11 AM | Updated on Jun 4 2025 1:11 AM

రైల్వే బ్లాక్‌తో రవాణాకు అంతరాయం

రైల్వే బ్లాక్‌తో రవాణాకు అంతరాయం

కాజీపేట రూరల్‌ : కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్నీరోడ్‌ సెక్షన్‌లో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన రైల్వే నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ (ఎన్‌ఐ) వర్క్స్‌ కారణంగా పలు రైళ్ల రవాణాకు అంతరాయం కలగనుంది. కాజీపేట జంక్షన్‌ నుంచి వయా కాజీపేట మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్డ్‌, మళ్లింపు చేసినట్లు అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు కాజీపేట–సిర్పూర్‌టౌన్‌ (17003) ప్యాసింజర్‌, బల్హార్షా–కాజీపేట (17004) రామగిరి ప్యాసింజర్‌, బల్హార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్‌, సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (12757) ఎక్స్‌ప్రెస్‌, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (12758) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాజీపేట–బల్హార్షా (17035) ప్యాసింజర్‌, ఈ నెల 19,20వ తేదీల్లో నాగ్‌పూర్‌–సికింద్రాబాద్‌ (20101) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ (20102) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గోరఖ్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (22533) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు యశ్వంత్‌పూర్‌–గోరఖ్‌పూర్‌ (22534) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 18వ తేదీన చర్లపల్లి–పట్నా (07255) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 20వ తేదీన చర్లపల్లి–పట్నా (07256) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 16వ తేదీన చర్లపల్లి–రక్సోల్‌ (07055) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 17వ తేదీన ముజఫర్‌పూర్‌–సికింద్రాబాద్‌ (05293) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్‌–ముజఫర్‌పూర్‌ (05294) ఎక్స్‌ప్రెస్‌, చర్లపల్లి–దానాపూర్‌ (07021) ఎక్స్‌ప్రెస్‌, సుబేదార్‌గంజ్‌–చర్లపల్లి (04121) ఎక్స్‌ప్రెస్‌, రక్సోల్‌–చర్లపల్లి (07066) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 20వ తేదీన దానాపూర్‌–చర్లపల్లి (07022) ఎక్స్‌ప్రెస్‌.

ఆరు రైళ్ల దూరం తగ్గింపు..

ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు భద్రాచలం రోడ్‌–బల్హార్షా (17033) సింగరేణి బల్హార్షా వెళ్లకుండా కాజీపేట వరకే వచ్చి వెళ్తుంది. సిర్పూర్‌టౌన్‌–భద్రాచలంరోడ్‌ (17034) సింగరేణిి బల్హార్షా వెళ్లకుండా కాజీపేట వరకే వచ్చి వెళ్తుంది. ఈ నెల 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17233) ఎక్స్‌ప్రెస్‌ కాగజ్‌నగర్‌నగర్‌ వెళ్లకుండా మంచిర్యాల వరకే వచ్చి వెళ్తుంది.ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సిర్పూర్‌కాగజ్‌నగర్‌–సికింద్రాబాద్‌ (17234) ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17011) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–బీదర్‌ (17012) ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాల వరకే వచ్చి వెళ్తుంది.

బెల్లంపల్లిలో పలు రైళ్లకు హాల్టింగ్‌ ఎత్తివేత..

ఈ నెల 12, 14, 19వ తేదీల్లో మైసూర్‌–జైపూర్‌ (12975) ఎక్స్‌ప్రెస్‌, ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌–న్యూఢిల్లీ (12723) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌–దానాపూర్‌ (12791) ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 11,13,16,18,20వ తేదీల్లో తిరుపతి–హజ్రత్‌నిజాముద్దీన్‌ (12707) ఎక్స్‌ప్రెస్‌లకు తాత్కాలికంగా బెల్లంపల్లిలో హాల్టింగ్‌ ఎత్తివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రైళ్ల రద్దు, రీషెడ్యూల్డ్‌, దారి మళ్లింపు

17 రైళ్లు రద్దు..6 దూరం కుదింపు

4 ట్రైన్లకు బెల్లంపల్లిలో హాల్టింగ్‌ ఎత్తివేత

3 రైళ్లు దారి మళ్లింపు

ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అమలు

దారి మళ్లింపు రైళ్లు..

ఈ నెల 19వ తేదీన యశ్వంత్‌పూర్‌–నిజాముద్దీన్‌ (15024) ఎక్స్‌ప్రెస్‌, వయా కాచిగూడ, ముద్కెడ్‌ మీదుగా, చర్లపల్లి–గోరఖ్‌పూర్‌ (12590) ఎక్స్‌ప్రెస్‌, వయా కాజీపేట, బల్హార్షా, నాగ్‌పూర్‌ మీదుగా ఈ నెల 18వ తేదీన గోరఖ్‌పూర్‌–చర్లపల్లి (12589) ఎక్స్‌ప్రెస్‌ వయా కాజీపేట, బల్హార్షా, నాగ్‌పూర్‌ మీదుగా దారి మళ్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement