
అలర్ట్.. అలర్ట్
ఒక వైపు కోవిడ్, మరో వైపు సీజనల్ వ్యాధులు
మందులు, కిట్లు సమకూర్చే పనిలో..
సీజనల్ వ్యాధులపాటు, కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన మందులు, కిట్లు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు తోపాటు ప్రమాదరకమైన మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలకు కావాల్సిన మందులు, యాంటీబయాటిక్స్‌ల్లో కొన్ని ఇప్పటికే స్టోర్ రూమ్‌కు చేరాయి. దీనికి తోడు కోవిడ్ చికిత్సకోసం సాధారణ మందులు, దగ్గు, జలుబు టానిక్స్, టాబ్లెట్లు, పారాసిటమాల్, రెమిడెిసీవర్, ప్లోవీర్ ఇంజక్షన్లు, హెరిత్రోమైసిన్ తదితర మందులు కావాలని రాష్ట్ర ఔషధ సరఫరా అధికారులకు ఇండెంట్ పెట్టారు. వీటితోపాటు పరీక్షలు నిర్వహించేందుకు పీపీ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు, శానిటైజర్లు, మొదలైనవి అవసరమని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
● ముంచుకొస్తున్న ముప్పు
● అప్రమత్తం కావాలని ఉన్నతాధికారుల ఆదేశం
● సర్వం సిద్ధం చేస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ
సాక్షి, మహబూబాబాద్ : వర్షాకాలం వచ్చిందంటే దోమలు, ఈగలు, అపరిశుభ్రత తదితర కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీనికి తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వం సిద్ధం చేస్తున్నారు.
అధికారుల అప్రమత్తం
కోవిడ్‌తోపాటు సీజనల్ వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు, సమర్థవంతంగా చికిత్స అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకోసం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ, చికిత్స, మందుల సరఫరా, కిట్లు మొదలైనవి సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నారు. వార్డులో బెడ్లు, ఫ్యాన్లు, వెలుతురు వచ్చే విధంగా మరమ్మతులు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా పైపు లైన్లు సరిచూస్తున్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులకు గురయ్యే వారికోసం జీజీహెచ్‌లో 50 పడకలు, గూడూరు, గార్ల, తొర్రూరు, మరిపెడ సీహెచ్‌సీల్లో 20 బెడ్ల చొప్పున సిద్ధం చేస్తున్నారు. ఇలా ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కో–ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

అలర్ట్.. అలర్ట్

అలర్ట్.. అలర్ట్

అలర్ట్.. అలర్ట్