
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వీర బ్రహ్మచారి మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన వినతులు 31, హౌజింగ్ 8, పంచాయతీరాజ్ శాఖ 5, ఇతర శాఖల కు సంబంధించిన వినతులు 30 వచ్చినట్లు అధికా రులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, సీపీఓ సుబ్బారావు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీపీఓ హరిప్రసాద్, డీడబ్ల్యూఓ ధనమ్మ తదితులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు
చేయాలి..
రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో ఏపని చేయలేక పోతున్నాను. ఉండడానికి ఇల్లు లేక నా ఇద్దరు కుమారులు, నాభార్య ఇబ్బంది పడుతున్నారు. కేవలం పింఛన్ డబ్బులతోనే జీవిస్తున్నాం. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి ఇచ్చాను.
– చెడిపాక లక్ష్మమ్య, దివ్యాంగుడు,
చిన్ననాగారం, ఇనుగుర్తి మండలం
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
అంధుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉన్నారు. అర్హత గల వారికి బ్యాక్ లాగ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలి. అంధుల సమస్యలు పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– అంధులు రవికుమార్, కృష్ణారెడ్డి,
వెంకటేశ్వర్లు, యాకమ్మ
నా ఆస్తి చిన్న కుమారుడు
కాజేశాడు
నాకు ఇద్దరు కుమారులు ఉండగా నా పేరున ఎకరం భూమి కేటాయించారు. ఆ భూమిని నా చిన్న కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్‌కు చేసుకుని నాకు అన్యాయం చేశాడు. తులం బంగారం, 20తులాల వెండి ఆభరణాలు కూడా తీసుకుని ఇంటి నుంచి గెంటేశాడు. నాకు న్యాయం చేసి నా భూమి నాకు ిఇప్పించాలి.
– అనసూర్య, ఎల్లంపేట గ్రామం, మరిపెడ మండలం
●
అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి
ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

వినతులు వెంటనే పరిష్కరించాలి

వినతులు వెంటనే పరిష్కరించాలి

వినతులు వెంటనే పరిష్కరించాలి