
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం రాత్రి కురిసిన అకాలవర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు శుక్రవారం రైతులు గోసపడ్డారు. కాగా మార్కెట్‌కు సెలవు ఇచ్చిన విషయం తెలియక తెల్లవారుజామున చుట్టు పక్కల గ్రామాల నుంచి చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. అయి తే మార్కెట్ గేట్‌కు తాళం వేసి ఉండడంతో రోడ్డుపై ట్రాక్టర్లు బారులుదీరాయి. దీంతో మహబూబా బాద్, వరంగల్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈక్రమంలో ట్రాఫిక్ జాం అయింది. డీఎస్పీ సత్యనారాయణ, రూరల్ సీఐ రమేశ్ ట్రాఫి క్‌ను క్లియర్ చేశారు. ధాన్యం లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లను నేరుగా రైతులు మిల్లులకు తీసుకెళ్లి, వ్యాపారులు పెట్టిన ధరకే అమ్ముకుని నష్టపోయారు.