
శుక్రవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2023
సాక్షి, మహబూబాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధంలాటింది. సరైన పాలకుడిని ఎన్నుకోవడంలో ఓటే కీలకం. కాగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 19,588మంది యువతీ యువకులు నూతనంగా ఓటరుగా నమోదై.. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును సక్రమంగా వినియోగించుకుంటామని తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరించే నిస్వార్థ నాయకులు, అభివృద్ధి, విజన్, ఉన్నతవిద్యావంతుడు, నిత్యం జనాల్లో ఉండే, విద్యాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులను ఎన్నుకుంటామని నూతన ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చారు.
జిల్లాలో 19,588 మంది
కొత్త ఓటర్లు
● మొదటిసారి ఓటు హక్కు
వినియోగానికి ఉత్సాహం
● సరైన పాలకులను
ఎన్నుకుంటామంటున్న యువత
● ఉద్యోగ, ఉపాధికి మార్గం
చూపాలని డిమాండ్
●
న్యూస్‌రీల్