
● సెమిస్టర్‌తోపాటు, ఇయర్‌వైజ్ విద్యార్థులకు కూడా..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో గతంలో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన విద్యార్థులకు బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉంటే వారు ఆయా సబ్జెక్టుల పరీక్షలు రాసుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్స్ కోర్సులు, సెమిస్టర్ సిస్ట మ్, ఇయర్ వైజ్‌స్కీం విద్యార్థులకు ప్రాక్టికల్స్, సెమి నార్లు తదితర ఏ పరీక్షల్లోనైనా బ్యాక్ లాగ్స్ ఉన్నవా రికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 2022–2023, 2023–2024 విద్యాసంవత్సరాల్లో జరిగే ఆ యా పరీక్షలకు బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీలో సంబంధిత అధికారులవద్ద ఆయా విద్యార్థులు వ్యక్తిగతంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని యూజీ, పీజీ, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఒక సెమిస్టర్‌కు రూ.2,000 ప్రాసెసింగ్ ఫీజు, రూ.3,000 చొప్పున ఒక పేపర్‌కు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని యూజీ, పీజీ కోర్సులు నాన్ ప్రొఫెషనల్స్ కోర్సులకు ఇయర్ వైజ్‌స్కీం విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.3,000, రూ.4,000 చొప్పున ఒక పేపర్‌కు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని యూజీ, పీజీ కోర్సులు ప్రొఫెషనల్ కోర్సులకు ప్రాసెసింగ్ ఫీజు ఒక సెమిస్టర్‌కు రూ.3,000, రూ.5,000 ఒక పేపర్‌కు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.