
కానిస్టేబుల్ వైపు ఆప్యాయంగా చూస్తున్న బాలుడు
ఖాకీచొక్కా మాటున కరుడుగట్టిన నేరస్తులను బెదిరించగల రాతిగుండె మాత్రమే కాదు.. కనికరం చూపగల తల్లి ప్రేమ కూడా ఉందని నిరూపించింది.. ఈ పోలీసమ్మ. ఆకలితో అలమటిస్తున్న చిన్నారికి తనకోసం తెచ్చుకున్న అన్నం పెట్టి అమ్మ మనసును చాటుకుంది.. ఈ కానిస్టేబుల్. కురవి మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన బచ్చలి మమత తన భర్తతో జరిగిన చిన్న గొడవతో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు కుమారుడితో కలిసి శనివారం వచ్చింది. చాలా సమయం వేచి ఉండడంతో మమత కుమారుడు ఆకలితో ఏడుస్తున్నాడు. గమనించిన కానిస్టేబుల్ అనితారాణి తాను తెచ్చుకున్న భోజనం టిఫిన్ బాక్స్‌ను బాలుడికి ఇచ్చి తల్లిమనసును చాటుకుంది. ఇదిలా ఉండగా.. గతంలో కానిస్టేబుల్ అనితారాణి రెండు పర్యాయాలు ఉత్తమ సేవలకు అవార్డు పొందడం గమనార్హం.
– కురవి