శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్‌లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్‌లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్‌లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు.


