నియోజకవర్గాల వారీగా..
ఎమ్మిగనూరులో
రక్తదానం చేస్తున్న
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ
సమన్వయకర్త బుట్టారేణుక
మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి నాయకత్వంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పాణ్యం అర్బన్ పరిధిలోని కల్లూరులోని శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పూజలు చేశారు. తమ నేత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్ ఆధ్వర్యంలో 108 టెంకాయలు కొట్టారు.
పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక శారద ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేశారు.
ఎమ్మిగనూరులోని తన కార్యాలయంలో మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక కేక్ కట్ చేశారు. అలాగే ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక కార్యాలయంలో భారీ కేక్ కట్‌చేశారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఆలూరులో రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాల్గొన్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తల మద్య భారీ కే క్ కట్ చేశారు. గూడూరులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గాల వారీగా..


