రాఘవేంద్రయా నమోస్తుతే!
మంత్రాలయం: చలిని లెక్క చేయకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక భక్తులు భారీగా ఆదివారం మంత్రలయానికి తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ దేవికి ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు ప్రత్యేక స్టీలుతో ఏర్పాటు చేసిన క్యూలైనులో తుంగభద్ర నది దగ్గర నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్‌లో భక్తులు పోటెత్తారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు రథోత్సవంపై ప్రహ్లాదరాయులు విహరించారు. తుంగభద్ర నది దగ్గర సీఐ రామాంజులు బందోబస్తు పర్యవేక్షించారు. పడవ యజమానులతో భక్తులు పట్ల జాగ్రత వహించాలన్నారు.


