యాగంటిలో ఎస్పీ పూజలు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని కర్నూలు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ దంతులు ఆదివారం దర్శించుకున్నారు. ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏక శిలా రూపంలో కొలువైన ఉమామహేశ్వర స్వామికి అభిషేకం, తదితర పూజలు చేశారు. పూజల అనంతరం ఎస్పీ దంపతులకు స్వామి వారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు.
బైక్ అదుపు తప్పి యువకుడి దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: మండల పరిఽధిలోని బోడబండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కోటేకల్ గ్రామానికి చెందిన మసీదపురం నరసింహులు కుమారుడు రామాంజనేయులు(25), మరో వ్యక్తి నరసప్ప వేర్వేరు బైక్‌లపై ఎమ్మిగనూరు వైపు వెళ్తున్నారు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి రామాంజనేయులు కిందపడిపోయాడు. ఇతని వెనుకే వస్తున్న నరసప్ప కూడా తన బైక్‌ను అదుపు చేస్తూ కిందపడ్డాడు. ఈ ఘటనలో రామాంజనేయులకు తలకు బలమైన గాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందగా నరసప్పకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఒక పాప సంతానం ఉన్నట్లు బంధువులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యాగంటిలో ఎస్పీ పూజలు


