
పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!
దేశమంతా యుద్ధ భయం.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, యుద్ధం వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేందుకు బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో మాక్ డ్రిల్ నిర్వహించారు. రోడ్డు పొడవునా పోలీసు వాహనాలు, ఖాకీ డ్రస్సు వేసుకున్న అధికారులు కలియతిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మందు బాబు పోలీసులైతేనేమి, ఎవరేమైతే నాకేంటి అన్నట్లు నడి రోడ్డులో మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పక్క నుంచే పోలీసు వాహనాలు వెళ్తున్నా.. తాను ట్యాక్స్‘బాబు’ అనే ధీమాతో ఎంచక్కా మందు కలుపుకొని గుటకేసిన దృశ్యాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దిన మద్యాంధ్రప్రదేశ్‌కు అద్దం పట్టాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!