
స్కూల్ లేదని తాగునీరు బంద్!
మహానంది: వేసవి సెలవులని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ పంపు కనెక్షన్ కట్ చేయడంతో బసవాపురం గ్రామస్తులకు తాగు నీటి సమస్య నెలకొంది. బసవాపురంలో రెండు చోట్ల నీటి ట్యాంకులున్నాయి. ఎంపీపీ పాఠశాల వద్ద ఉన్న మోటార్‌కు కనెక్షన్ తీసేయడంతో నీటి సమస్య తలెత్తింది. గ్రామంలో వాటర్ ఫిల్టర్ ట్యాంకులు సైతం లేకపోవడంతో ఇదే నీటిని ప్రజలు తాగుతుంటారు. ఉన్న రెండు మోటార్ల వద్ద సరఫరా అయ్యే నీళ్లలో పాఠశాల వద్ద ఉన్న నీళ్లే బాగుంటాయని, అధికారులు స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్‌ను ఆరా తీయగా.. ఇంత వరకు గ్రామస్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తామని తెలిపారు.
పది రోజులుగా బసవాపురం
గ్రామస్తులకు నీటి సమస్య