
పెద్దహరివాణంలో సామూహిక వివాహాలు
ఆదోని రూరల్: పెద్దహరివాణం గ్రామంలో ఆదివారం 55 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామంలో వెలిసిన శ్రీగర్జిలింగేశ్వరస్వామికి బండార మహోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం సామూహిక వివాహాలు నిర్వహించారు. నూతన వధూవరులు స్వామి వారికి పూజలు నిర్వహించారు. 12 యేళ్లకు ఒకసారి బండార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. నూతన జంటలను ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆశీర్వదించారు.