
వీహెచ్‌ఏల రేషనలైజేషన్‌కు శ్రీకారం
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన శాఖలో గ్రామ ఉద్యాన సహాయకుల రేషనలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన శాఖ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు పి.రామాంజనేయులు, నాగరాజు, కర్నూలు, నంద్యాల జిల్లాల హార్టికల్చర్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 215 మంది గ్రామ ఉద్యాన సహాయకులు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఉన్నప్పటికీ వీహెచ్‌ఏలు లేకపోవడం వల్ల రైతులకు సేవలు అందడం లేదు. ఉద్యాన పంటలు ఉన్న అన్ని ప్రాంతాల్లో వీహెచ్‌ఏలు అందుబాటులో ఉండాలని, అందరికి సమానంగా సాగు విస్తీర్ణం ఉండాలనే కోణంలో కసరత్తు చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రామాంజనేయులు తెలిపారు. ఒకటి, రెండు ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు అనూష, మదన్‌మోహన్‌గౌడు, నరేష్‌కుమార్‌రెడ్డి, దస్తగిరి, చందన తదితరులు పాల్గొన్నారు.