కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు/ జిల్లా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి తెలిపారు. జిల్లా కోర్టుల్లోనూ మధ్యవర్తిత్వం విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, ఎన్‌జీఓలకు ఇచ్చిన 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు భావన, మధ్యవర్తిత్వం, సాంకేతిక అంశాలపై న్యాయవాదులకు కేరళల నుంచి వచ్చిన గోపీనాథన్ బృంద సభ్యులు 40 గంటలపాటు శిక్షణ తరగతులను నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ..సివిల్ ప్రోసిజర్ కోడ్‌లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, కోర్టుల్లో కేసు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి