ఈ నెల 16వ తేదీన (ఆదివారం) జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు స్థానిక మినీ సమావేశ భవనంలో 1వ స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించనున్నామన్నారు. అనంతరం 10.30 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలో పొందుపరిచిన గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, వ్యవసాయం, జలవనరుల శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.