● జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ నవీన్‌కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): మత్స్యకారుల సంక్షేమానికి, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం(డీఎఫ్‌సీఎస్) చైర్మన్ బీఎస్ నవీన్‌కుమార్ తెలిపారు. మంగళవారం కర్నూలు బంగారుపేటలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సవరించిన బైలాను అన్ని సహకార సంఘాలకు త్వరలోనే తెలుగులోనే అందజేస్తామన్నారు. మత్స్యకారులందరు ఎన్‌ఎఫ్‌డీపీ, ఈ–శ్రామిక్‌లలో పేర్లను నమోదు చేసుకోవా లని సూచించారు. కొత్త సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న సంఘాలలో సభ్యత్వాలను పెంచుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌సీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణి, డైరెక్టర్లు శేఖర్, నాగశేషులు, శ్రీనివాసు లు, మల్లీశ్వరుడు, మద్దిలేటి, నగేష్ పాల్గొన్నారు.