అమృతం అసురుపాలు కాకుండా లోక
సంరక్షణ కోసం మహా విష్ణువు దాల్చిన జగన్మోహిని అలంకరణలో ప్రహ్లాదవరుడు భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో సోమవారం ప్రహ్లాదవరుడు జగన్మోహిని అలంకారంలో కనువిందు చేశారు. పట్టు వస్త్రాలు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి పల్లకీలో మాడ వీధుల్లో విహరించారు. ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలా నరసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
– ఆళ్లగడ