‘సూపర్‌ సిక్స్‌’ మోసంపై సమష్టి పోరు | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ సిక్స్‌’ మోసంపై సమష్టి పోరు

Mar 11 2025 1:43 AM | Updated on Mar 11 2025 1:41 AM

కర్నూలు (టౌన్‌): ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలందరినీ టీడీపీ నేతలు మోసం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ‘సూపర్‌ సిక్స్‌’ మోసంపై సమష్టిగా అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్‌ అధ్వర్యంలో సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. హామీలు నేరవేర్చకుంటే కాలర్‌ పట్టుకోవాలని అన్న మంత్రి నారా లోకేష్‌ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. గత ఏడాది ఆందోళనల కారణంగానే ఫీజు బకాయిలు రూ.700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికీ రూ.3,200 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఓటాన్‌ అకౌంట్‌, వార్షిక బడ్జెట్‌లో విద్యకు అరకొర నిధులు కేటాయించారన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు భృతి ఇస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా.. బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న కర్నూలులో చేపడుతున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని అన్ని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్‌ చెప్పి ఇప్పటికే మూడు నెలలు అవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ధనుంజయ ఆచారి, షరీఫ్‌, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి షాపీర్‌బాషా, ఏఐఎస్‌ఎఫ్‌ రాయలసీమ యూనివర్సిటీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మణిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కటికె గౌతం, ఆర్‌వైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంగముని నాయుడు పాల్గొన్నారు.

ఎవరు ఏం మాట్లాడారంటే..

12న ‘యువత పోరు’కు భారీగా

తరలి రావాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎస్వీ మోహన్‌రెడ్డి

విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందికరంగా మారింది.

– సునీల్‌ రెడ్డి, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ నాయకుడు

ఇంట్లో అందరి విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామన్నారు. నిధులు కేటాయించకుండా మళ్లీ మోసం చేశారు.

– శ్రీరాములు, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి

నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఖాళీగా ఉండలేక ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయింలేదు.

– సూర్యకుమార్‌, లైబ్రరీ యూనియన్‌ అధ్యక్షుడు

డీగ్రీలు, పీజీలు చదివిన వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవితం సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని అందరికీ అర్థమైంది.

– రవికుమార్‌, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకుడు

విద్యార్థులను, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. కచ్చితంగా సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయాల్సిందే. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం.

– చంద్రప్ప, టీఎన్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఏమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ ఇవ్వలేదు.

– కటారు కొండ సాయి కుమార్‌, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement