కర్నూలు(అగ్రికల్చర్): నగర శివారులో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు ప్రేమ్‌కుమార్(45) ఆనారోగ్య కారణా లతో ఆదివారం మరణించారు. ఈయన భారత సైన్యంలో ఎంఈజీ 22 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి హవల్దారుగా పదవీ విరమణ తీసుకున్నారు. నగర శివారులోని వెంకాయపల్లి ఎల్లమ్మ దేవస్థానం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించడంతో పలువురు మాజీ సైనికులు సంతాపం ప్రకటించారు. మృతుడి స్వగ్రామమైన ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. సైన్యంలో విశేషంగా సేవలు అందించిన ప్రేమ్‌కుమార్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి ఆదివారం ఓ ప్రకటనలో తన సంతాపం తెలిపారు.
బైక్ అదుపు తప్పి..
● కానాలా గ్రామ వాసి మృతి
ఉయ్యాలవాడ: మాయలూరు– కానాల ఆర్‌అండ్‌బీ రహదారిలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన కమలాకర్ (45) పనిమీద గోవిందపల్లె గ్రామానికి వెళ్లాడు. తర్వాత తిరిగి తన స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో మాయలూరు– కానాల ఆర్‌అండ్‌బీ రోడ్డులో రైల్వే ట్రాక్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనున్న గుంతలో పడింది. ఈఘటనలో కమలాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
గోనెగండ్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని మండల పరిధిలోని ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కురువ ఈరన్న (30) అనే యువకుడు మృతిచెందాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. కురువ చిన్న ఉరుకుందు, గంగమ్మ కుమారుడు అయిన ఈరన్న శనివారం రాత్రి గోనెగండ్ల నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే, గాజులదిన్నె ప్రాజెక్టు స్టేజ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో ఈరన్న తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతిడి అక్క కురువ నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బియ్యం పట్టివేత
నందికొట్కూరు: పట్టణంలోని సంగయ్యపేటలో పగడం పక్కిరయ్య అనే వ్యాపారి ఇంటి ముందు 37 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్టేషన్‌కు తరలించినట్లు టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
మాజీ సైనికుడి మృతి
మాజీ సైనికుడి మృతి