● ఇద్దరి పరిస్థితి విషమం
ఆళ్లగడ్డ: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలోని హైవే ఢాబా సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడప పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహానంది క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకుని కారులో తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఆళ్లగడ్డ సమీపంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బ్రిడ్జిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న సుధాకర్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేఽశ్వర్లు, మనీష్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రమోద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు.