
సమావేశంలో పీఆర్ ఈఈ ఎస్‌సీఈ మద్దన్న
కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపడుతున్న ప్రాధాన్యత భవన నిర్మాణాలకు (గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పీఆర్ కర్నూలు ఈఈ ఎస్‌సీఈ మద్దన్న తెలిపారు. ఈ పనుల వేగాన్ని కూడా పెంచాలని ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో కర్నూలు డీఈఈ మహేశ్వరరెడ్డి, ఏఈ రవిమోహన్‌రెడ్డితో జరుగుతున్న అభివృద్ధి పనులు, బిల్లులపై ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలానికి రూ.60 లక్షల ప్రకారం కర్నూలు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో రూ.6.60 కోట్లతో 123 అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల్లో ఇప్పటికే 20 పూర్తి కాగా, మిగిలినవి వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. దశల వారీగా పూర్తి అయిన పనులకు వర్కింగ్ ఎస్టిమేట్స్ వేసి అప్‌లోడ్ చేస్తే మార్చి నెలలో బిల్లులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒక్కో సచివాలయ పరిధిలో రూ.20 లక్షల మేర సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతరత్రా పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులను కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలోని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
పీఆర్ ఈఈ ఎస్‌సీఈ మద్దన్న