
‘‘సాయం కోరి సీఎం సభ వద్దకు వస్తే తోసేశారు’’ శీర్షికన ఈనాడులో ఈనెల 2న ప్రచురితమైన వార్త అవాస్తవం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. వీరన్న సమస్యకు సానుకూలంగా స్పందించి ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆ మేరకు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో వీరన్న కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. తన సోదరుని సమస్యను సీఎం ఓపికగా విని సానుకూలంగా స్పందించడం పట్ల వీరన్న సోదరుడు ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు.
వీరన్న సమస్యను వింటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
లక్షలాది జనం.. అడుగడుగునా నీరాజనం.. ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిన సభా ప్రాంగణం.. పులవర్షం కురిపిస్తూ స్వాగతం.. అన్నదాతకు పెట్టుబడి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పత్తికొండ అభివృద్ధికి వరాల వర్షం కురిసింది. ఇదే ప్రాంతంలో పలువురు తమ సమస్యలను విన్నవించుకునేందుకు రాగా.. ఎంతో ఓపికతో తెలుసుకున్న సీఎం అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశించడం.. మరుసటి రోజే ఆ దిశగా చర్యలు ఊపందుకోవడం విశేషం.
బాధితులకు అండగా
సీఎం వైఎస్ జగన్
పత్తికొండ సభలో ఆరోగ్య సమస్యలపై
పలువురి వేడుకోలు
తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.లక్ష
అండగా నిలవాలని కలెక్టర్‌కు ఆదేశం
ఎప్పటిలానే విషం చిమ్మిన
ఎల్లో మీడియా

ఈనాడులో వచ్చిన వార్త

కలెక్టర్ నుంచి చెక్కు అందుకుంటున్న వీరన్న సోదరుడు