కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ట్రాఫిక్‌ ఏసీపీగా శ్రీవేద ఈవీఎం గోడౌన్‌ తనిఖీ –8లోu భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆయా రంగాలను విస్మరిస్తే పేదలు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం ప్రభుత్వాస్పత్రుల్లో అందుతుందనే భరోసా కల్పించారు. ఆ భరోసాను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. – డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ, వైద్య విభాగం లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. కార్పొరేట్‌పై చూపిస్తున్న శ్రద్ధ ప్రభుత్వాస్పత్రులపై చూపకపోవడంతో వైద్య సేవలు దిగజారాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో సర్కార్‌ విఫలమైంది. దీంతో ప్రభుత్వాస్పత్రులకు రావాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు ఓపీలు తగ్గడమే నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు పీహెచ్‌సీల్లో ప్రసవాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిలిచిపోయాయి. గ్రామానికి, ఇంటికే వెళ్లి వైద్య సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషియన్‌, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు మంగళం పలికారు. ఆపద వస్తే కుయ్‌ కుయ్‌ మంటూ వెళ్లే 108 వాహనాలు నేడు కుయ్యో మొర్రో అంటున్నాయి. ఇక 104 వాహనాల జాడే లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ , ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ పథకాలు నిర్వీర్యంగా మారాయి. దీంతో మళ్లీ పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత 22 నెలల చంద్రబాబు పాలనలో వైద్యసేవలు పూర్తిగా దిగజారాయి. దేశంలోనే తొలిసారిగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా స్పెషలిస్టు వైద్యులను నేరుగా గ్రామాలకు పంపించి వైద్య పరీక్షలు చేసి ప్రజలకు భరోసా కల్పించారు. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్‌, జనరల్‌ సర్జరీ ఇలా పలు విభాగాలకు చెందిన వైద్యులు గ్రామాలకే వెళ్లి సేవలు అందించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉంటే మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఆ రోగి జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే వరకూ ఆరోగ్య సిబ్బంది ఫాలో అప్‌ చేస్తూ ఉండేవారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడ్‌ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది. మారుమూల గ్రామాలకు సైతం 104 వాహనంలో కుటుంబ డాక్టర్‌(ఫ్యామిలీ ఫిజీషియన్‌) కార్యక్రమం ద్వారా పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించే వారు. ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో కచ్చితంగా వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. నడవలేని స్థితిలో మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి చూసేవారు. ఇప్పుడు అవేమీ లేకపోగా, గ్రామాల్లో ఉండే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు సైతం నిర్వీర్యంగా మారాయి. వాటిలో ఉండాల్సిన కనీస మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. 108 వాహనాలు ఎన్టీఆర్‌ జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 29 ఉన్నాయి. ఇవి కొంత కాలంగా మరమ్మతులకు గురవుతున్నాయి. కుయ్‌..కుయ్‌..కుయ్‌ అంటూ క్షతగాత్రులు, రోగులను వేగంగా ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన వాహనాలు కుయ్యో..మొర్రో అంటూ కదులుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగులు ప్రాణాపాయ పరిస్థితికి చేరుకుంటున్నారు. గతంలో రక్తపోటు, మధుమేహం, హైపో థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక రోగులను గుర్తించి, వారిని 104 సేవలకు మ్యాపింగ్‌ చేసేవారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లినప్పుడు వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌రీల్‌

రెండేళ్లలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలు పల్లెల్లో వైద్యం అందని దయనీయ పరిస్థితి కుయ్యో.. మొర్రో అంటున్న 108 వాహనాలు నిలిచిన 104 సేవలు ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్‌లకు బ్రేక్‌ దీర్ఘకాలిక రోగుల ఇక్కట్లు

మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కృష్ణలంక: ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబును సోమవారం ట్రాఫిక్‌ ఏసీపీ డాక్టర్‌ శ్రీవేద బాధ్యతల స్వీకరణ అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు.

చిలకలపూడి(మచిలీపట్నం): బందరు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): భక్తుల సౌకర్యం, భద్రత, మెరుగైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులు నిర్ణయించారు. బ్రాహ్మణ వీధిలోని కార్యాలయంలో సోమవారం దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌ అమలు తీరు, కుంభాభిషేకం సమయంలో ఆలయ ఉద్యోగిపై జరిగిన దాడిపై చర్చించారు. ఎక్కెడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, రికార్డుల పరంగా ఉండాల్సిన భూముల్లో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి, ఎవరెవరు కౌలుకు తీసుకున్నారు, ప్రస్తుతం వారి చేతుల్లోనే భూములు ఉన్నాయా.. చేతులు మారాయా, కౌలుకు ఇచ్చిన భూముల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కౌలుదారులు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా వంటి అంశాలపై చర్చ జరిగింది. అమ్మవారి పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు క్యూ లైన్లలో టీవీలు ఏర్పాటు చేయాలని, ఆలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోవాలని, జూన్‌ నుంచి అన్నదానం, లడ్డూ పోటు ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 19 అంశాలను ఆమోదించగా 65వ అంశాన్ని తీర్మానించడం, 83, 84, 103 అంశాలను వాయిదా వేశారు.

వాడీవేడిగా..!

సమావేశంలో పలుఅంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారం చోరీ ఘటన, దుర్గ గుడి అభివృద్ధి, దైనందిన కార్యకలాపాలపై చేసిన ప్రతిపాదనలపై ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై మండలి సభ్యులు మండిపడ్డారని సమాచారం. ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈఓ శీనా నాయక్‌, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్‌.రమ తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరుకు చెందిన రాజారావుకు మధుమేహం ఉంది. గతంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రామానికి వచ్చే వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునేవాడు. ప్రస్తుతం రాకపోవడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది.

గ్రామీణులకు భరోసా ఏది?

నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం

కుయ్యో.. మొర్రో అంటున్న 108

దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు

ధర భళా.. దిగుబడి బేల

7

Advertisement
 
Advertisement
Advertisement