న్యూస్‌రీల్
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడును తొలగించాలన్న వైఎస్సార్ సీపీ జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిన నాయకులు బీఆర్ నాయుడు వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శల వెల్లువ
సాగర్ నీటిమట్టం వివరాలు
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు తీరుపై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొని బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పామర్రు శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేస్తూ శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పూజల అనంతరం కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్.నాయుడు బాధ్యతలు చేపట్టాక తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బి.ఆర్.నాయుడు వీడియోలు బయటకు వచ్చినప్పటికీ సీఎం చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి తప్పకుండా శిక్షిస్తారని పేర్కొన్నారు.
తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని బీఆర్ నాయు డిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తి డిమాండ్ చేశారు. కానూరు తిరుపమ్మ ఆలయంలో శనివారం ఆయన పార్టీ నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి విషయంలో టీడీపీ ప్రభుత్వం అలంబిస్తున్న తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ విజయవాడ పటమటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. హిందూ ధర్మంపై చంద్రబాబుకు నిజమైన ప్రేమ ఉంటే వెంటనే బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఏ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, కొండపల్లి పట్టణ అధ్యక్షుడు పోరంకి శ్రీనివాసరాజు, జిల్లా కార్యదర్శి మిక్కిలి శరభయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరువూరులోని వెంకటాచలస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, రేగళ్ల మోహన్‌రెడ్డి, పురిటిపాటి సుధారాణి, తిరువూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, లోకేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
జగ్గయ్యపేట పట్టణంలో సీతారాంపురం కొత్త వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆలయం ఎదురుగా టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుని పదవి తొలగించాలని కోరుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు పఠాన్ ఫిరోజ్‌ఖాన్, మండవ శ్రీనివాస్‌గౌడ్, చింతకుంట్ల వెంకటరెడ్డి, బత్తుల రామారావు, నంబూరి రవి, కాటేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ అమరలింగేశ్వరస్వామి ఆలయం, కంచికచర్ల పాతశివాలయంలో వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు వేమా సురేష్‌బాబు, బండి మల్లికార్జున్ రావు, మార్త శ్రీనివాసరావు, మంగలపూడి కోటిబాబు, దేవకొండ గురవయ్య, మాడుగుల శంకర్, ఎంపీటీసీ సభ్యులు ఎం.మధుబాబు, వేమా రోజారమణి పాల్గొన్నారు.
కానూరు తిరుపతమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న దేవభక్తుని చక్రవర్తి
తిరువూరులో కొబ్బరికాయ కొడుతున్న స్వామిదాసు
కంచికచర్లలో పూజలు చేస్తున్న జగన్మోహనరావు
7
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 532.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 13,866 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


