దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు, చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రా లను బహూకరించారు. అనంతరం ఈవో చాంబర్‌లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులతో చర్చించారు. భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లు, దేవస్థానంలో ఇటీవల చేపట్టిన మార్పులు, అదనపు కౌంటర్లు, ఆన్‌లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. కార్యక్ర మంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దీక్ష విరమణల సమయంలో తయారు చేసిన లడ్డూలను శుక్రవారం కూడా దేవస్థానం ఉచితంగా పంపిణీ చేసింది. గురు, శుక్రవారాలలో మొత్తం 1.30 లక్షల లడ్డూలను ఉచితంగా పంపిణీ చేసినట్లు దేవస్థాన అధికారులు, చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవానీ దీక్ష విరమణల నిమిత్తం మొత్తం 28.08 లక్షల లడ్డూలను తయారు చేయగా, 24.49 లక్షల లడ్డూలను విక్రయించినట్లు అధికారులు పేర్కొన్నారు. దేవస్థానం వద్ద 4.61 లక్షల లడ్డూల స్టాక్ ఉండగా, వాటిలో 3.32లక్షల లడ్డూలను విక్రయం నిమిత్తం కౌంటర్లలో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మిగిలిన 1.30లక్షల లడ్డూలను ఉచిత ప్రసాద వితరణ బదులుగా గురు, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణంలోని వేరు వేరు ప్రదేశాల్లో భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన పీతల సునీల్‌కుమార్ కుటుంబం రూ. లక్ష, ప్రకాశం జిల్లా పుల్లెల చెరువుకు చెందిన టి. బ్రహ్మానందరెడ్డి కుటుంబం టి. కోటిరెడ్డి పేరిట రూ. 1,01,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె. సత్యనారాయణమ్మ, అంజయ్య ల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పక డ్బందీ ఏర్పాట్లతో విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్‌ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్లలోపు పిల్లలు లక్ష్యంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, ప్రజా రవాణా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులు కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. 611 గ్రామీణ బూత్‌లు, 355 అర్బన్ బూత్‌లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా బృందాలు సేవలందిస్తాయన్నారు.
22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే..
ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి సర్వే ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా అధికారులు చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆర్డీవోలు పాల్గొన్నారు.
దుర్గమ్మ సన్నిధిలో దేవదాయ శాఖ మంత్రి


