నృత్య శిక్షణ తరగతుల ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కూచిపూడి సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి సూచించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్ర సంగీత నాటక అకాడమీ డైరెక్టర్ కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి ఆధ్వర్యంలో కూచిపూడిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ నిర్వహించే నృత్య శిక్షణ తరగతులను సర్పంచ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం, ఏఎంసీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, కూచిపూడి రోటరీ క్లబ్ ఉపాధ్యక్షుడు కొండ వీటి అమర బాలేశ్వరరావు, నాట్యాచా ర్యులు పసుమర్తి నారాయణమూర్తి, మువ్వ మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు, నాట్యాచార్యులు జగన్నాథరావు, డాక్టర్ వసంత్ కిరణ్ పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల ఎనిమిదో తేదీన కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో గుర్తు తెలియని పురుషుడు అనారోగ్యంతో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని అతడిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతను చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురు వారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆస్పత్రి అవుట్‌పోస్ట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 49 సంవత్సరాలు ఉంటుం దని, అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్నా డని, ఆకుపచ్చ రంగు చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో లేదా 94406 27176, 0866 – 2568220 ఫోన్ నంబర్లలో సమాచారం అందించాలని కోరారు.


