21న యూటీఎఫ్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నాలుగో కౌన్సిల్ సమావేశంలో ఈ నెల 21వ తేదీన తిరువూరులో జరుగుతుందని సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య తెలిపారు. ఈ సమావేశాల కరపత్రాలను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ.. తిరువూరులో జరిగే సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎనస్.ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సంఘం కార్యకలాపాల నివేదికలను ప్రవేశపెట్టి ఆమోదించి, నూతన కమిటీ ఎన్నిక జరుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్, నాయకులు ఎం.హనుమంతరావు, మచ్చా శ్రీనివాస్, పి.లీల, పి.నాగేశ్వరరావు, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


