కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
● సామాజిక సమరసత వేదిక
జాతీయ కన్వీనర్ శ్యామ్‌ప్రసాద్
● ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవం
సందర్భంగా వన సమారాధన
చల్లపల్లి: ప్రతి ఒక్కరూ కుటుంబం వ్యవస్థకు, బాధ్యతలకు, ప్రకృతి పరిరక్షణకు, సమాజ శ్రేయస్సుకు ప్రాముఖ్యతను ఇవ్వాలని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ కె.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని నడకుదురు ఉసిరి వనంలో బుధవారం కార్తిక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరువోలు బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన సభలో శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి బాధ్యతగా ఉండాలన్నారు. భారతదేశంలో తొలిసారి అంటరాని తనం నిర్మూలన ఉద్యమం ప్రారంభమైంది కృష్ణా జిల్లాలోనే అని చరిత్రను వివరించారు.
ఆర్‌ఎస్‌ఎస్ మతం కోసమే కాదు..
ఆర్‌ఎస్‌ఎస్ అనేది కేవలం మతం కోసమో, ఒక కులం కోసమో కాదని.. భారతీయుడైన ప్రతి ఒక్కరూ అందులో చేరేందుకు అవకాశం ఉందని సీనియర్ కాలమిస్టు, కార్టూనిస్టు దుగ్గరాజు శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కామర్సు సుబ్రహ్మణ్యం, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జన్ను జగదీష్, హిందు బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా విచ్చేసి వన సమారాధనలో పాల్గొన్నారు.


