ప్రజా దర్బార్‌లో అర్జీల స్వీకరణ
మచిలీపట్నంటౌన్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్జీలను అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. 110 అర్జీలు రాగా అత్యధికంగా ఇళ్ల స్థలాలు, పింఛన్లకు సంబంధించినవే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.


