నూతన ఆర్జిత సేవా కౌంటర్ ఏర్పాటు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కనకదుర్గనగర్‌లో దేవస్థానం నూతన ఆర్జిత సేవా టికెట్, ప్రసాదాలు, లగేజీ కౌంటర్‌లను బుధవారం ప్రారంభించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌లు ఆర్జిత సేవా కౌంటర్‌కు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు ప్రసాదాలు విక్రయించారు. ఇదే కౌంటర్‌లో అమ్మవారికి విరాళాలు సమర్పించే వీలు కల్పిస్తున్నట్లు అధకారులు పేర్కొన్నారు. నూతన ఆర్జిత సేవా కౌంటర్ నుంచి వృద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెల్లవారుజామున ఆలయం తెరిచినప్పటి నుంచి రాత్రి ఆలయం మూసే వరకు కౌంటర్ పని చేస్తుందని పేర్కొన్నారు. కౌంటర్‌లో రెండు షిఫ్టులలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాఘవరాజు, గూడపాటి సరోజినీదేవి, ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ఎఈవోలు చంద్రశేఖర్, ఎంఎస్‌ఎల్. శ్రీనివాస్, ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానానికి నూతన అంబులెన్స్...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మసీ కంపెనీ అంబులెన్స్‌ను అందించింది. అంబులెన్స్‌కు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ నూతన అంబులెన్స్ మహా మండపం దిగువన భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు.
దేవస్థానానాకి విరాళంగా అంబులెన్స్
నూతన ఆర్జిత సేవా కౌంటర్ ఏర్పాటు


