పాండురంగడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మచిలీపట్నంటౌన్: కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి నగరంలోని చిలకలపూడిలో వేంచేసి ఉన్న పాండురంగస్వామిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద భక్తులు పూజలు నిర్వహించి దీపారాధనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల బొమ్మల, పాండురంగస్వామి వారి చిత్రపటాల దుకాణాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షణలో స్వామి వారి పల్లకి ఉత్సవం, గోపాల కాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
పాండురంగడి దర్శనానికి పోటెత్తిన భక్తులు


