వైద్య శిబిరాలు తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
కోడూరు: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని హంసలదీవిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను జిల్లా వైద్యాధికారి పి.యుగంధర్ తనిఖీ చేశారు. పాలకాయతిప్ప బీచ్, హంసలదీవి వేణుగోపాలుడి ఆలయం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు బుధవారం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను డీఎంహెచ్‌ఓ ప్రత్యేకంగా పరిశీలించారు. అత్యవసర సేవలు అందించేందుకు వినియోగించే మందులతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 108 వాహనాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కూడా శిబిరంలో బీపీ కట్టించుకొని మిషన్ పనితీరును పరిశీలించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్‌చంద్, వైధ్యాధికారి అరుణ పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): మండలంలోని చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యుగంధర్ బుధవారం తనిఖీ చేశారు. తొలుత ఆయన హాజరుపట్టికను పరిశీలించారు. ముఖ ఆధారిత హాజరును తప్పనిసరిగా వారికి కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లో మాత్రమే వేయాలని అలాగే అటెండన్స్ రిజిష్టర్‌లో సంతకాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు


