9న హరివిల్లు చిత్రకళా పోటీలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో హరివిల్లు చిన్నారుల రంగుల పండుగ పేరుతో చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నామని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు అనుమకొండ సునీల్‌కుమార్ అన్నారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో పండుగకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ చిత్రకళా పోటీలు మూడు విభాగాల్లో జరుగుతాయని, ప్రవేశం ఉచితమన్నారు. సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో 3,4,5 తరగతుల విద్యార్థులకు మీకు నచ్చిన చిత్రం అనే అంశంపై, జూనియర్స్ విభాగంలో 6,7 తరగతులకు నచ్చిన సంప్రదాయ క్రీడ అనే అంశంపై, సీనియర్స్ విభాగంలో 8,9,10 తరగతులకు నచ్చిన సైన్స్ ఆవిష్కరణ అనే అంశంపై పోటీలు జరుగుతాయని వివరించారు. పోటీల అనంతరం మ్యాజిక్ షో, తరువాత బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 7వ తేదీ లోపు 9347950085 నంబర్‌కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, కోశాధికారి రమేష్, సంధ్య, సౌజన్య, సుధారాణి, శ్రావణ్, సుష్మ తదితరులు పాల్గొన్నారు.


