ఆర్టీసీ బస్సులో పొగలు
నందిగామ టౌన్: విజయవాడ గవర్నరుపేట–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించిన ఘటన పట్టణం సమీపంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు విజయవాడ నుంచి కోదాడకు ఆర్టీసీ బస్సు 15 మంది ప్రయాణికులతో వెళ్తోంది. నందిగామ పట్టణం సమీపంలోకి వచ్చే సరికి ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపి ఆర్టీసీకి చెందిన మరొక బస్సులో పంపించారు. బస్సు ఇంజిన్‌లో ఆయిల్ లీకవటంతో పొగలు వ్యాపించినట్లు డ్రైవర్ తెలిపారు. కర్నూలు ఘటన మరువక ముందే ఈ విధంగా జరగడంతో ప్రయాణికులు ఆందోళనచెందారు.
పొగలు వ్యాపించడంతో రోడ్డుపై నిలిచిపోయిన బస్సు


