వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
పెనుగంచిప్రోలు: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులు ధాన్యం అమ్ముకోవటానికి వారి సెల్‌ఫోన్‌లోని వాట్సాప్(7337359375)లో షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. ధాన్యం నింపుకోవటానికి సంచులు కూడా జిల్లా యంత్రాంగం నేరుగా అందిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పంట నమోదు 98 శాతం పూర్తయిందన్నారు.
రేపు కేంద్ర బృందం పర్యటన..
మండలం ఆస్పిరేషన్ బ్లాక్‌లో ఉన్నందున ఈనెల 23న కేంద్ర బృందం పెనుగంచిప్రోలు, ముండ్లపా డు గ్రామాల్లో పర్యటించనుందని కలెక్టర్ చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడాలన్నారు. గోకులం షెడ్లు నిర్మాణం వేగంగా జరగాలని అధికారులకు సూచించారు. మండలంలోని లింగగూడెం గ్రామంలో తాగునీటి సమస్యను తక్ష ణం పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ను ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ ఎం. సుహాసిని, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్ ఎ. శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి. శ్రీను పాల్గొన్నారు.


