కాజ్‌వేపై నుంచి మునేరులో పడిన ఇసుక ట్రాక్టర్
పెనుగంచిప్రోలు: కాజ్‌వేపై నుంచి ఇసుక ట్రాక్టర్ మునేరులో పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మునేరు కాజ్‌వే అవతల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్కుతో సహా మునేరులో పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ గోగుల నాగు పక్కకు దూకటంతో తలకు గాయమైంది. ట్రాక్టర్ జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందినది కాగా, డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం రాయగూడెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


